Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

Pavan Chandragiri October 4, 2026

బాల్కొండ, ఆంధ్రప్రభ: బాల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారి-44పై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముప్కాల్‌ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ (42) మృతి చెందాడు.

ఆర్మూర్‌ నుంచి బాల్కొండ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శ్రీనివాస్‌ను వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News