Sowjanya Anneboina April 30, 2026prabhanews.com
Rs.10thousand | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడిలో ఫారెస్ట్ బీట్ అధికారి పట్టుబడ్డారు.
నడిగూడెం ఫారెస్ట్ బీట్ అధికారి బానోత్ నరేష్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
వివరాల ప్రకారం, ఓ వ్యక్తి పనిని చేయించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అధికారులు ఉచ్చుపన్ని నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ఏసీబీ అధికారులు దాడి చేసి బానోత్ నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో అటవీ శాఖలో కలకలం రేగింది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు.

