Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

S. Suresh Kumar: 330 కి.మీ దూరం సైకిల్ తొక్కిన ఎమ్మెల్యే..

Bala Raju October 5, 2026breaking news, latest telugu news, Rajajinagar MLA, S. Suresh Kumar, telugu latest news, telugu news

చెళ్లకెర(చిత్రదుర్గ), ఆంధ్రప్రభ: లక్ష్య సాధనకు, శారీరక దృఢత్వానికి వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని రాజానగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్.

సురేష్ కుమార్ మరోసారి చాటి చెప్పారు. 76 ఏళ్ల వయసులో కూడా ఆయన బెంగళూరు నుంచి పుదుచ్చేరి వరకు ఏకంగా 330 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి తమ గమ్యస్థానాన్ని చేరుకున్నారు.

సహచరులతో కలిసి సాగిన యాత్ర..

శుక్రవారం రోజున రాజానగర పెడల్ పవర్ టీమ్ సభ్యులతో కలిసి ఆయన బెంగళూరు నుంచి తమ సైకిల్ యాత్రను ప్రారంభించారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ప్రయాణంలో మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ, దాదాపు 19 గంటల పాటు సైకిల్ తొక్కి ఆదివారం ఉదయానికి పుదుచ్చేరి చేరుకున్నారు.

రెండోసారి పుదుచ్చేరి యాత్ర..

సురేష్ కుమార్ పుదుచ్చేరికి సైకిల్‌పై వెళ్లడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో కూడా ఆయన తన మిత్రబృందంతో కలిసి కన్యాకుమారి, తిరుపతి, ధర్మస్థల వంటి ఆధ్యాత్మిక మరియు ప్రముఖ ప్రాంతాలకు రెండుసార్లు సైకిల్ యాత్రలు నిర్వహించారు. ఈ వయసులో కూడా ఆయన చూపుతున్న ఉత్సాహం, ఫిట్‌నెస్‌ పట్ల ఉన్న అంకితభావాన్ని పలువురు ప్రముఖులు, ప్రజలు విశేషంగా ప్రశంసిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News