Bala Raju October 3, 2026prabhanews.com
ఆపరేటర్ చంద్రశేఖర్ కు గాయాలు - ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
జగిత్యాల, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో విధుల్లో ఉన్న ఆపరేటర్ పై శుక్రవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.
సబ్ స్టేషన్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ పై అదే ప్రాంతానికి చెందిన పల్లెపు రాజు అనే వ్యక్తి కర్రతో దాడి చేయగా, దాడిలో చంద్రశేఖర్ కు తీవ్ర గాయాలయ్యాయి. తోటి సిబ్బంది 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. సబ్ స్టేషన్ పక్కనే నివాసం ఉంటున్న పల్లెపు రాజు కుటుంబ సభ్యులు తరచూ సబ్ స్టేషన్ ఆవరణలోకి వచ్చి చెత్త వేయడం, బహిర్భూమికి వెళ్లడం చేస్తున్నారని, దీనిని ఆపరేటర్ చంద్రశేఖర్ మందలించారని తెలిసింది.
ఆ కక్షను మనసులో పెట్టుకుని అర్ధరాత్రి విధుల్లో ఉన్న సమయంలో పల్లెపు రాజు కర్రతో దాడి చేసినట్లు సిబ్బంది తెలిపారు. విధుల్లో ఉన్న ఉద్యోగిపై దాడిని విద్యుత్ శాఖ సిబ్బంది, యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సారంగాపూర్ ఎస్సై గీత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
