Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సర్‌ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసిన బీఎల్‌ఓకు అభినందన

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

చెన్నూర్, ఆంధ్రప్రభ : సర్‌ ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా వంద శాతం పనిని పూర్తి చేసిన బీఎల్‌ఓను తహసీల్దార్‌ మల్లికార్జున్‌ అభినందించారు.

మంగళవారం చెన్నూర్‌ మున్సిపల్‌ పరిధిలోని 193వ పోలింగ్‌ కేంద్రం పరిధిలో సర్‌ ప్రక్రియ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓ తోట లావణ్య, బీఎల్‌ఏ వసీం చేపట్టిన సర్‌ ప్రక్రియలో ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయడంపై తహసీల్దార్‌ ప్రశంసలు తెలిపారు. విధుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క బీఎల్‌ఓ తోట లావణ్య, బీఎల్‌ఏ వసీంలను స్ఫూర్తిగా తీసుకుని సర్‌ ప్రక్రియను నిబంధనల ప్రకారం సమర్థంగా పూర్తి చేయాలని తహసీల్దార్‌ మల్లికార్జున్‌ సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News