Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సత్నాలో వరద ఉద్ధృతి.. రైల్వే ట్రాక్‌లపైకి నీరు

Rama Rao August 30, 2026Saatna

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారీ వర్షాలతో మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరద నీరు రైల్వే ట్రాక్‌లపైకి చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మజ్‌గవాన్, చిత్రా రైల్వే స్టేషన్ల సమీపంలో పట్టాలపై నీరు చేరడంతో పలు రైలు సర్వీసులు ప్రభావితమయ్యాయి. చిత్రా సమీపంలోని సత్నా-మాణిక్‌పూర్ రైల్వే మార్గంలో కొన్ని ప్రాంతాలు నీట మునిగిపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తమై రైళ్ల వేగాన్ని తగ్గించారు. ఈ పరిస్థితి కారణంగా 24 ప్రయాణికుల రైళ్లు, 20 సరుకు రైళ్ల సర్వీసులపై ప్రభావం పడింది. వరద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News