Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సెర్ప్ సీసీ ఆకస్మిక మరణం తీరని లోటు

Sowjanya Anneboina August 24, 2026prabhanews.com

అవయవదానంతో మరొకరికి జీవం పోసిన సీసీ బాలరాజు

మ్మడి మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో సెర్ప్ సీసీగా పనిచేస్తున్న బోయిని బాలరాజు ఆకస్మికంగా మృతిచెందారు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో సోమవారం ఆయన మృతిచెందినట్లు తెలిసింది. ఆయన మరణానంతరం కూడా అవయవదానం ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగు నింపారు. కళ్లతో పాటు మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలను జీవన్‌దాన్ ద్వారా కుటుంబ సభ్యులు దానం చేశారు.

గ్రామీణ పేదల అభ్యున్నతికి, మహిళా సంక్షేమానికి అంకితభావంతో సేవలందించిన బాలరాజు మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని సెర్ప్ మిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. విషాద సమయంలోనూ అవయవదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడం గొప్ప నిర్ణయమని సహోద్యోగులు కొనియాడారు. సెర్ప్, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో మంచి బుక్‌కీపర్‌గా, కమ్యూనిటీ కోఆర్డినేటర్‌గా, సమర్థవంతమైన నిర్వాహకుడిగా, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇన్‌చార్జి మేనేజర్‌గా బాలరాజు విశిష్ట సేవలు అందించారని సహోద్యోగులు గుర్తుచేశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని తెలిపారు.

అధికారులతో ఆప్యాయత, ఆదరాభిమానాలతో వ్యవహరిస్తూ వారి నమ్మకాన్ని పొందారని, సహోద్యోగులతో సోదరభావంతో కలిసిమెలిసి పనిచేశారని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆయన చేసిన సేవలను సహోద్యోగులు గుర్తు చేసుకున్నారు. అవయవదానం ద్వారా తన సేవా స్ఫూర్తిని మరోమారు చాటుకున్నారని తెలిపారు. ఆయన సేవాభావం, మానవతా దృక్పథం అందరికీ ఆదర్శమని సహోద్యోగులు అన్నారు. బాలరాజు ఆకస్మిక మరణం పట్ల సెర్ప్ మిత్రబృందం, సహోద్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News