Sowjanya Anneboina August 23, 2026prabhanews.com
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : శ్రావణమాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసమని, ఈ మాసంలో పుణ్యకార్యాలు చేస్తే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందని జుక్కల్ గోవింద్ మఠ్ సంస్థాన్‌కు చెందిన శ్రీ కేశవ్ గోపాల్ మహారాజ్ అన్నారు.
జుక్కల్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ నిజిలింగేశ్వర ఆలయంలో గత ఏడు రోజులుగా కొనసాగిన మన్మథ్ స్వామి కపిల్‌దర్ పరమరహస్య ఫోతి పారాయణం ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేశవ్ గోపాల్ మహారాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు, ప్రవచనం నిర్వహించారు.
శ్రావణమాసంలో ప్రజలందరూ భక్తిమార్గాన్ని అనుసరించి దానధర్మాలు, జపం, పూజలు, ఇతర పుణ్యకార్యాల్లో పాల్గొనాలని సూచించారు. బ్యాంకులో డబ్బును దాచుకున్నట్లే ఈ మాసంలో పుణ్యకార్యాలు చేసి పుణ్యఫలాలను సంపాదించుకోవాలని అన్నారు. ఏడు రోజులుగా ఆలయంలో అభిషేకాలు, బిల్వార్చన, హారతి, తీర్థప్రసాదాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పూజారి విశ్వనాథ్ అప్ప సేవలందించగా, భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
