Abhi Naga October 24, 2026prabhanews.com
- నిన్న 70,496 మంది భక్తుల దర్శనం
- హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు..
- 3.77 లక్షల లడ్డూల విక్రయం
తిరుమల, అక్టోబర్ 24 (ఆంధ్రప్రభ): తిరుమల శ్రీవారిని అక్టోబర్ 23న మొత్తం 70,496 మంది భక్తులు దర్శించుకున్నారు.
29,327 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.95 కోట్ల ఆదాయం సమకూరింది. 3.77 లక్షల లడ్డూలను విక్రయించారు. 2.28 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించారు.
ప్రస్తుతం దర్శన పరిస్థితి
అక్టోబర్ 24న తిరుమలలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో, ఏటీజీహెచ్ వద్ద వెలుపలి వరుసలోనూ భక్తులు వేచి ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక దర్శన టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 12-15 గంటల సమయం పడుతోంది.
అక్టోబర్ 26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో ఈ నెల 26న పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులు విరజిమ్మే గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
