Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ప్రధాన కార్యదర్శి

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

ద్దూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి సెప్టెంబర్‌ 4న నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌, ఐఏఎస్‌ గురువారం పరిశీలించారు.

జిల్లా కలెక్టర్‌ ప్రియాంక, ఎస్పీ డాక్టర్‌ వినీత్‌, ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి మద్దూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.
ముందుగా మద్దూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని పరిశీలించారు.

అనంతరం చింతల్‌దిన్నె మార్గంలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాల, కళాశాల నిర్మాణ ప్రాంగణంలో భవన నిర్మాణానికి సంబంధించిన పటం, పనుల కాలపట్టికతో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి మార్చి నెలలోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్‌ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను జిల్లా కలెక్టర్‌ ప్రియాంక, ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ పరిశీలించారు. మద్దూరు సమీపంలోని డిగ్రీ కళాశాల భవనం వద్ద ఒక స్థలంతో పాటు చింతల్‌దిన్నె సమీపంలోని మరో స్థలాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్‌ ఏర్పాటుకు అవసరమైన భద్రతా, సాంకేతిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News