Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై ప్రత్యేక తనిఖీలు

Nagamani Malligari September 2, 2026prabhanews.com

భీమ్‌గల్‌ పట్టణంలో రెండో రోజు తనిఖీలు..
నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు జరిమానాలు

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు భీమ్‌గల్‌ పట్టణంలో మున్సిపల్‌ అధికారులు రెండో రోజు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు దుకాణాలను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగిస్తున్న వ్యాపారులను గుర్తించి జరిమానాలు విధించారు.

ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ డి. గజానంద్‌ మాట్లాడుతూ హోటళ్లు, బేకరీలు, అల్పాహార కేంద్రాలు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నిర్వాహకులు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కోరారు.

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్‌ గజానంద్‌ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇకపై కూడా తనిఖీలు కొనసాగించి జరిమానాలు విధిస్తామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో మున్సిపల్‌ వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News