State Governor | విమానాశ్రయంలో ఘన స్వాగతం

State Governor | విమానాశ్రయంలో ఘన స్వాగతం

ప్రభన్యూస్

ప్రభన్యూస్

1d

Loading...

Nagamani Malligari April 6, 2026State Governor |

State Governor |విమానాశ్రయంలో ఘన స్వాగతం

State Governor |శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : పుట్టపర్తి, జేఎన్టీయూలో నిర్వహించనున్న స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ ఎస్.

అబ్దుల్ నజీర్ సోమవారం పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, పరిశ్రమలు-వాణిజ్యం మరియు ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి ఘనంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఆర్డీఓ సువర్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. గవర్నర్ రాక నేపథ్యంలో విమానాశ్రయం నుంచి జేఎన్టీయూ వరకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. స్నాతకోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News