Dailyhunt
సుచరిత ఎడ్యుకేషనల్ సొసైటీ సేవలు అభినందనీయం..

సుచరిత ఎడ్యుకేషనల్ సొసైటీ సేవలు అభినందనీయం..

Nagamani Malligari April 29, 2026educational

సుచరిత ఎడ్యుకేషనల్ సొసైటీ సేవలు అభినందనీయం..

శావల్యాపురం, ఆంధ్రప్రభ : సుచరిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎస్ఐ మోర్ల వెంకటేష్ బాబు అన్నారు.

మండల కేంద్రమైన శావల్యాపురం గ్రామంలో గుంటూరు- కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉన్న అమ్మవారి ఆలయం వద్ద సుచరిత ఎడ్యుకేషనల్ సొసైటీ తరుపున ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ చలివేంద్రాన్ని బుధవారం రోజున ఎస్ఐ వెంకటేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సుచరిత ఎడ్యుకేషన్ సొసైటీ చేస్తున్న సేవలను అభినందించారు. వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చడానికి ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రస్తుత వేసవికాలంలో ఎండలు అధిక ఉష్ణోగ్రతతో ఉన్నాయని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అమృతపూడి కోటయ్య, రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి బత్తుల వెంకటేశ్వర్లు, సుచరిత ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి కె.వి.ఆర్ మోహన్ చందు, సభ్యులు భువనగిరి వెంకటేశ్వర్లు, బండారు వెంకట కోటయ్య, ఎర్రం శెట్టి వీరాంజి, కనకదుర్గమ్మ అమ్మవారి చైర్మన్ రెడ్డి జ్వాలా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News