Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
- అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారంటూ హైకోర్టును ఆశ్రయించిన స్థానికులు
వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండల కేంద్రంలో నిర్మిస్తున్న బడా పహాడ్ స్వాగత తోరణ నిర్మాణాన్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రధాన రహదారి వద్ద ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపట్టారంటూ స్థానికులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులకు, గ్రామ కార్యదర్శికి నిర్మాణ పనులను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో స్వాగత తోరణ నిర్మాణ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
