Nagamani Malligari October 24, 2026prabhanews.com
'ఓట్ బచావో-దేశ్ బచావో' కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీకాంతరావు
జుక్కల్, ఆంధ్రప్రభ : 'ఓట్ బచావో-దేశ్ బచావో' కార్యక్రమంలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును తమిళనాడులోని నాలుగు జిల్లాలకు పరిశీలకుడిగా నియమించారు.
ఈ నేపథ్యంలో శనివారం తమిళనాడు చేరుకున్న ఎమ్మెల్యేకు మధురై విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్. కామరాజ్తో పాటు నాలుగు జిల్లాల డీసీసీ అధ్యక్షులు వి. రాజమోహన్, ఎం. కృష్ణమూర్తి, సెంచి కుమార్ గాంధీ, ఇరంగూర్ పాండి తదితర కాంగ్రెస్ నాయకులు ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు విరుదునగర్ జిల్లాలో నిర్వహించిన 'ఓట్ బచావో-దేశ్ బచావో' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటు ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు విలువ, ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
