Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

TG | డ్యాన్సర్‌పై కేసు.. ఈశ్వర్‌ సాయి పరారీ..!

Bala Raju September 1, 2026prabhanews.com, Telangana, TG News

మాధురి రాథోడ్ ఫిర్యాదుతో కేసు

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : 'ప్రమీల ఓ ప్రమీల', 'బాసింగ బలాలే' వంటి జానపద గీతాలతో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్‌ ఈశ్వర్‌ సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొంతకాలంగా శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మాధురి రాథోడ్‌ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడన్న ఆరోపణలపై పోలీసులు మోసపూరిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

కేసు నమోదు విషయం తెలియడంతో ఈశ్వర్‌ సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి ఆచూకీ కోసం పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రెండు బృందాలు ఈశ్వర్‌ సాయిని అదుపులోకి తీసుకునేందుకు గాలిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఫిర్యాదుదారురాలి నుంచి మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం. దర్యాప్తు పూర్తయిన తర్వాత కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News