Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

TG | జస్ట్ మిస్.

Bala Raju September 2, 2026prabhanews.com, Telangana, TG News

వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు…
54 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదం..

నలుగురికి స్వల్ప గాయాలు .. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావి వద్దకు దూసుకెళ్లి నిలిచిపోయింది.

కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌ వైపు 54 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో రోడ్డుపక్కనే ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లిన బస్సు అక్కడే ఆగిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

బస్సు బావిలోకి పడిపోకుండా నిలిచిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పరిశీలన చేస్తున్నారు.

బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం.. స్వల్ప గాయాలు
స్టీరింగ్ రాడ్ ఊడిపోవడమే కారణం

చిగురుమామిడి, ఆంధ్రప్రభ : హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం సుందరగిరి గ్రామ శివారులో ప్రమాదానికి గురైంది.నాలుగు వరుసల రహదారి నిర్మాణం పనులు జరుగుతుండటంతో పాటు, బస్సులో సామర్థ్యానికి మించి దాదాపు 50 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా బస్సు ఎగిరిపడింది. ఈ క్రమంలో స్టీరింగ్ రాడ్ ఉన్నపళంగా ఊడిపోవడంతో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, రహదారి పక్కనే ఉన్న స్థానిక రైతు కావటి బక్కయ్యకు చెందిన వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.ప్రమాద సమయంలో బస్సు వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు.

బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాకుండా కేవలం స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద శబ్దం విన్న వెంటనే గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రయాణికులను బస్సులో నుంచి బయటకు తీసి ఉపశమనం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News