Bala Raju October 4, 2026prabhanews.com, Telangana, TG News
TG | సంపులో పడి… నాలుగేళ్ల బాలుడి మృతి…
TG | ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం ప్రకాశ్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
ఇంటి వద్ద నిర్మాణంలో ఉన్న సంపులో పడి నాలుగేళ్ల బాలుడు గగన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
సోమవారపు ఉమారాణి, సాయి దంపతుల కుమారుడు గగన్ ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న సంపులో పడిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు గుర్తించి బయటకు తీసేలోపే బాలుడు మృతి చెందాడు.
కళ్లముందే ఆడుకుంటున్న కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వారి ఆర్తనాదాలు స్థానికులను సైతం కంటతడి పెట్టించాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
