Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

టీజీపీఎస్సీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Nagamani Malligari October 24, 2026prabhanews.com

అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలమ్‌

కరీంనగర్‌, క్రైమ్‌, ఆంధ్రప్రభ : టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలమ్‌ తెలిపారు.

టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ సైంటిస్ట్‌, అనలిస్ట్‌ గ్రేడ్‌-2 ఆన్‌లైన్‌ పరీక్షల నేపథ్యంలో శనివారం ఆయన పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరీంనగర్‌ నగరంలోని వివేకానంద డిగ్రీ కళాశాల, హుజూరాబాద్‌లోని కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సెక్షన్‌ 144 అమలు చేస్తున్నామని, సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయించినట్లు వెల్లడించారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోని సీసీ కెమెరాల పనితీరు, బయోమెట్రిక్‌ విధానం, అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ తనిఖీల్లో పోలీస్‌ అధికారులు, పరీక్ష కేంద్రాల సమన్వయకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News