Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tirumala | శిలాతోరణం వరకు క్యూలైన్‌.

Tirumala | శిలాతోరణం వరకు క్యూలైన్‌.

Bala Raju October 4, 2026andhra pradesh, AP news, prabhanews.com, Tirumala

Tirumala | శిలాతోరణం వరకు క్యూలైన్‌…

కిలోమీటరు మేరకు క్యూలైన్‌..

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
శనివారం 91,296 మంది భక్తుల దర్శనం
హుండీ ఆదాయం రూ.5.06 కోట్లు
4.67 లక్షల లడ్డూల విక్రయం
3.19 లక్షల మందికి అన్నప్రసాదం

Tirumala | తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలిరావడంతో కొండపై రద్దీ కొనసాగుతోంది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తుల క్యూలైన్‌ శిలాతోరణం వైపు వెలుపలికి చేరింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ తాజా సమాచారం వెల్లడించింది.

అక్టోబర్‌ 3న ఒక్కరోజే 91,296 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 32,805 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.5.06 కోట్ల ఆదాయం లభించింది. టీటీడీ 4.67 లక్షల లడ్డూలను విక్రయించగా.. సుమారు 3.19 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించింది.

రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం అందిస్తున్నారు. వైద్య సేవలు అవసరమైన వారి కోసం అశ్విని ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. శనివారం ఒక్కరోజే అక్కడ 4,516 మందికి వైద్య సేవలు అందించినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులు క్యూలైన్లలో సంయమనం పాటిస్తూ టీటీడీ సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News