Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ.

Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ.

Bala Raju September 29, 2026andhra pradesh, AP news, prabhanews.com

Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ…

24 గంటల వరకు దర్శనం!
శిలాతోరణం వరకు క్యూ లైన్లు..

సోమవారం 84,171 మంది భక్తుల దర్శనం

Tirumala | తిరుమల, ఆంధ్రప్రభ: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్లు వెలుపల శిలాతోరణం వరకు విస్తరించాయి.

టీటీడీ అధికారిక వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 27న 83,578 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు సెప్టెంబర్‌ 26న 82,181 మంది దర్శనం చేసుకున్నారు.

20 నుంచి 24 గంటల సమయం…

ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీ దృష్ట్యా టైమ్‌ స్లాట్‌ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో భక్తులు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమ తిరుమల ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు…

ఇదిలా ఉండగా.. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ ఉత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలో విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News