Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.

Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.

Bala Raju October 23, 2026andhra pradesh, AP news, prabhanews.com

Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…

సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం

గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు
ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 నుంచి 5 గంటల నిరీక్షణ

Tirumala | తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శుక్రవారం తిరుమల గిరులు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. సర్వదర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. రద్దీ పెరగడంతో స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సర్వదర్శనం కోసం 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 నుంచి 5 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన వారికి 5 నుంచి 7 గంటల నిరీక్షణ తప్పడం లేదు.

గురువారం 65,113 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, శ్రీవారి హుండీ కానుకల రూపంలో రూ.3.82 కోట్ల ఆదాయం లభించింది. అదేవిధంగా 3.71 లక్షల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News