Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ట్రాక్టర్​కి ఉరివేసుకుని వృద్ధురాలి ఆత్మహత్య.

Pavan Chandragiri October 24, 2026

రాజాపేట, ఆంధ్రప్రభ :

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన గవ్వాల ఐలమ్మ (80) శనివారం రాత్రి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ ట్రాలీకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఐలమ్మకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె గత కొన్నేళ్లుగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాధారణంగా కుమార్తెల వద్ద ఉంటున్న ఆమె.. సుమారు 10 నుంచి 15 రోజుల క్రితం కుటుంబంలో ఒకరు మరణించడంతో స్వగ్రామమైన బొందుగులకు వచ్చినట్లు సమాచారం.

అనారోగ్య సమస్యలతో ఆమె మనస్తాపానికి గురై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ.. ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News