Bharath November 15, 2026prabhanews.com
మంచిర్యాల, ఆంధ్రప్రభ: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. మంచిర్యాల జిల్లాకు చెందిన చంద్రయ్య (53) అనే వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోయి ప్లాట్‌ఫాం, రైలు మధ్య ఇరుక్కుపోయారు.వివరాల్లోకి వెళితే..
చంద్రయ్య గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చారు. రైలు కదులుతుండగా హడావుడిగా ఎక్కే ప్రయత్నం చేయడంతో ఆయన అదుపుతప్పి జారి కింద పడిపోయారు. ప్రమాదాన్ని గమనించిన అక్కడ విధుల్లో ఉన్న ఆర్‌పీఎఫ్ జవాన్లు వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి అతడిని బయటకు లాగి కాపాడారు.ఈ మొత్తం ఘటన ప్లాట్‌ఫాంపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. స్వల్ప గాయాలతో చంద్రయ్య బయటపడ్డారు. కదులుతున్న రైలు ఎక్కవద్దని, తొందరపాటు ప్రాణాలకే ముప్పు అని రైల్వే పోలీసులు హెచ్చరిస్తున్నారు.
