Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఉచిత విద్య, వైద్యం కోసం ఉద్యమం చేపడతాం

Bala Raju October 24, 2026prabhanews.com

ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

చౌటుప్పల్‌, ఆంధ్రప్రభ: పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో బలమైన ఉద్యమ కార్యాచరణ చేపడతామని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

శనివారం తన నివాసంలో ఎమ్మార్పీఎస్‌ యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ, మాదిగ జర్నలిస్టు ఫోరం చౌటుప్పల్‌ మండల మాజీ అధ్యక్షుడు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్‌ మున్సిపల్‌ నాయకుడు బోదుల స్వామి తదితరులు మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదిగ విద్యార్థి ఫెడరేషన్‌ (ఎంఎస్‌ఎఫ్‌) కమిటీల ఏర్పాటును వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువత సంఘటితమై హక్కుల సాధన కోసం ఉద్యమించాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News