Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఉమ్మడి ఆదిలాబాద్‌లో విషాదం..

Bala Raju November 15, 2026prabhanews.com

రూ.10 లక్షల అప్పుల భారంతో రైతు ఆత్మహత్య
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ :
పంట దిగుబడి చేతికి రాకపోవడం, అప్పుల భారం మోయలేక మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రానికి చెందిన నీలగిరి ఆశన్న (43) అనే రైతు అప్పుల బాధతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం.. తలమడుగు గ్రామానికి చెందిన నీలగిరి ఆశన్న తన తల్లి పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమితో పాటు, మరో 17 ఎకరాలు కౌలుకు తీసుకొని మొత్తం 20 ఎకరాల్లో వ్యవసాయం సాగు చేస్తున్నాడు.

ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా కురవకపోవడం, పంట దిగుబడి రాకపోవడంతో వ్యవసాయం కోసం చేసిన అప్పులు భారీగా పెరిగాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆశన్న శనివారం రాత్రి కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడు 20 ఎకరాల భూమి సాగు కోసం దాదాపు రూ.10 లక్షల వరకు అప్పులు చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు. మృతునికి కుమారుడు, కూతురు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News