Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఉట్నూర్ ముట్టడికి భారీగా తరలిరావాలి..

Sowjanya Anneboina August 23, 2026prabhanews.com

జైనూర్, ఆంధ్రప్రభ : గిరిజనుల హక్కులు, రిజర్వేషన్లు పగడ్బందీగా అమలు చేయాలని, పోలీసు నియామకాల్లో జీవో నంబర్‌ 109 ప్రకారం గిరిజన అభ్యర్థులకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని తుడుం దెబ్బ కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షుడు గోడం గోపీచంద్‌ డిమాండ్‌ చేశారు.

ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 24న సోమవారం తుడుం దెబ్బ ఆధ్వర్యంలో తలపెట్టిన ఉట్నూర్‌ ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాతో పాటు కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ముట్టడి కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. గిరిజనుల హక్కులు, రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాలే మార్గమని పేర్కొన్నారు. గ్రామ గ్రామాల నుంచి ఆదివాసీ సంఘాల నాయకులు, గిరిజనులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి ఉట్నూర్‌ ఐటీడీఏ ముట్టడిని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News