Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

వాగ్దానాల అమలు కోసం సమరశీల పోరాటం

Rama Rao September 1, 2026Telangana

కోదాడ, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఓడించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు.

ఎన్నికల సమయంలో అన్ని వర్గాల ప్రజలకు దేవుళ్లపై ప్రమాణాలు చేసి హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఏ ఒక్కదానినీ పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న ప్రజలను కాంగ్రెస్‌ నాయకులు దుర్భాషలాడుతున్నారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేసే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని మల్లయ్య యాదవ్‌ తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యక్రమాలను రూపొందించుకుని రాష్ట్రవ్యాప్తంగా సమరశీల పోరాటాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలు, ఎన్నికల హామీల అమలు కోసం బీఆర్‌ఎస్‌ నిరంతరం ప్రజల తరఫున పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News