Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వడ్లు కొనకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం..

వడ్లు కొనకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం..

Nagamani Malligari April 30, 2026Kisan Morcha

డ్లు కొనకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం..

నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్

జన్నారం, ఆంధ్రప్రభ : రైతులు ఎంతో చెమటోర్చి పండించిన వడ్లను కొనడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్ ఆరోపించారు.

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు.

దీంతో రైతులంతా ఆ కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చి కుప్పలుగా పోసుకున్నప్పటికీ వారాలు గడుస్తున్న వడ్లు కాంటా పెట్టడం లేదని ఆయన ఆరోపించారు. వెంటనే వడ్లు తూకం వేస్తూ కొనాలని,లేకుంటే ఆందోళన చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు జి.మధుసూదన్ రావు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్, బీజేపీ జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బద్రి నాయక్, నాయకులు గోలి చందు, ఎం.వీరాచారి, అప్పాల జలపతి, ఎస్. పవన్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News