Nagamani Malligari April 6, 2026Hostels
వసతి గృహ విద్యార్థులకు స్వచ్ఛజలమే లక్ష్యం…
CSR కింద 4 వాటర్ ప్యూరిఫైర్ల ప్రారంభం …కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్
పుట్టపర్తి, ఆంధ్రప్రభ : జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల కింద ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు అందజేసిన నాలుగు వాటర్ ప్యూరిఫైర్లను ఆయన ప్రారంభించారు. కదిరి ప్రాంతంలోని మూడు బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, ఒక ఎస్సీ హాస్టల్ కోసం సుమారు రూ.50 వేల విలువైన వాటర్ ప్యూరిఫైర్లను APGB బ్యాంకు అందజేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా వసతి గృహాల్లో నాణ్యమైన తాగునీటి సదుపాయం అత్యవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు వివిధ బ్యాంకుల CSR సహకారంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలకు మొత్తం 14 వాటర్ ప్యూరిఫైర్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని అన్ని వసతి గృహాలకు అవసరమైన మౌలిక వసతులను CSR నిధుల ద్వారా కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, బ్యాంకర్లు ఇదే విధంగా సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో APGB రీజినల్ మేనేజర్ టి. రమేష్, పుట్టపర్తి శాఖ మేనేజర్ కె. చంద్రశేఖరయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జి. రాజేంద్ర కుమార్ రెడ్డి, వసతి గృహ అధికారులు పాల్గొన్నారు.

