Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

వెల్దండలో రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం

Bala Raju October 5, 2026breaking news, latest telugu news, road accident, telugu latest news, telugu news, Veldanda

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ దుర్మరణం

వెల్దండ అక్టోబర్ 5 ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై ఏవీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలపాలై ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆ మహిళ పింక్ కలర్ టీ షర్ట్స్ పై ఆర్డర్ ఆన్ లైన్ లో పేరుతో షర్ట్ ధరించింది.

ఆసుపత్రికి మృతదేహం తరలింపు..

ఉదయాన్నే రోడ్డుపై మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెల్దండ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

పోలీసుల విజ్ఞప్తి..

మృతిచెందిన మహిళ వివరాలు ఇంకా తెలియరాలేదని, ఆమె ఆచూకీ లేదా గుర్తింపు తెలిసిన వారు వెంటనే వెల్దండ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని అధికారులు కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News