Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

వేల్పూర్‌ మండలంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

Rama Rao September 2, 2026Telangana

వేల్పూర్‌, ఆంధ్రప్రభ: వేల్పూర్‌ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో బుధవారం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

మాజీ సీడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌కుమార్‌ సహకారంతో గ్రామంలోని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఆరె పూజ, నోముల సురేఖ, బండారి రాజు, అంకన్నగారి గంగు, ఈదుల వంశీ, జండాకాడి సాయిలు, గడ్డం చిన్న గంగారం, పూప్పల పవన్‌లకు కలిపి రూ.3,32,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, సహకరించిన అన్వేష్‌రెడ్డి, ముత్యాల సునీల్‌కుమార్‌తో పాటు గ్రామ కాంగ్రెస్‌ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్‌, కాంగ్రెస్‌ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ టక్కరి గంగాధర్‌, ఘట్‌ అవతల నర్సారెడ్డి, హలీముద్దీన్‌, కృపానందం, నాచ్చన్నగారి గంగారెడ్డి, గట్టాతల చిన్న రాజన్న, రతీష్‌, శ్రీను, గంగ సాయిలు, రిజ్వాన్‌, నాని, కాంగ్రెస్‌ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News