Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

వెయ్యి రోజుల్లో.. అభివృద్ధి పరుగులు

Nagamani Malligari September 1, 2026prabhanews.com

బీఆర్‌ఎస్‌ కంటే వెయ్యిరెట్ల అభివృద్ధి

గోదావరిఖని, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో పరిపూర్ణమైన ప్రజాపాలన కొనసాగుతోందని, వెయ్యి రోజుల పాలనలో గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంతో పోలిస్తే వెయ్యిరెట్ల అభివృద్ధి జరుగుతోందని తెలంగాణ శాసనసభ వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ చైర్మన్‌, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్‌ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గంలో సుమారు రూ.900 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అన్ని రంగాల్లో నగరాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. భారీ ప్రదర్శన సందర్భంగా మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌కు అన్ని వర్గాల ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు అడుగడుగునా స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News