Sowjanya Anneboina August 29, 2026prabhanews.com
కడెం, ఆంధ్రప్రభ: ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని విద్యాశాఖ ఖానాపూర్ విభాగ సహాయ నోడల్ అధికారి బి.రాజేష్ నాయక్ సూచించారు.
శనివారం కడెం మండలంలోని గంగాపూర్, కొర్రతండా గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను ఆయన సందర్శించి విద్యార్థుల తరగతి గది అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.
విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన చేపట్టి వారి సామర్థ్యాలను క్రమంగా పెంచాలని రాజేష్ నాయక్ ఉపాధ్యాయులకు సూచించారు.
కూడికలు, తీసివేతలు వంటి గణిత అంశాలతో పాటు భాషా సామర్థ్యాలను మెరుగుపరిచే విధంగా బోధన కొనసాగించాలని తెలిపారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధించేందుకు బోధన ఉపకరణాలను వినియోగించాలని సూచించారు. ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన విద్యా సహాయాన్ని అందించాలని ఆయన పేర్కొన్నారు. తరగతి గదిలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచేలా బోధనా పద్ధతులను అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు దామోదర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
