Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

వీఎస్‌పీ పరిశ్రమలో ఐటీ సోదాలు

Sowjanya Anneboina September 23, 2026prabhanews.com

  • మీడియాను అనుమతించని అధికారులు

సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : హత్నూర మండల పరిధిలోని చందాపూర్‌ గ్రామ శివారులో ఉన్న వీఎస్‌పీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో బుధవారం ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహించారు.

పరిశ్రమలోకి మీడియా ప్రతినిధులను అనుమతించకపోవడంతో సోదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీ అధికారులు పరిశ్రమలో పలు రికార్డులు, పత్రాలను పరిశీలించినట్లు సమాచారం. అయితే సోదాలకు గల కారణాలు, ఏయే అంశాలపై తనిఖీలు నిర్వహించారు, అధికారులు ఏమైనా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారా అనే వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News