Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

విజ్ఞాన విన్యాసాలు.. గణిత సోయగాలు!

Sowjanya Anneboina August 31, 2026prabhanews.com

నుల పండుగగా రాష్ట్ర స్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళా
8 విభాగాల నుంచి 500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల సందడి

ముధోల్, ఆంధ్రప్రభ: ముధోల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళా విద్యార్థుల సృజనాత్మకత, ప్రతిభకు వేదికగా నిలిచింది. గణిత, విజ్ఞాన, సాంస్కృతిక ప్రదర్శనలతో మేళా ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్థులు రూపొందించిన వినూత్న నమూనాలు, నూతన ఆవిష్కరణలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

విద్యార్థుల ప్రతిభకు అద్దం..

శిశు వర్గ, బాల వర్గ, కిశోర వర్గాల విద్యార్థులు సైన్స్, గణిత విభాగాల్లో వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శాస్త్రీయ ప్రయోగాలు, గణిత నమూనాలు, నూతన ఆవిష్కరణలు, సృజనాత్మక ప్రాజెక్టులను విద్యార్థులు ఉత్సాహంగా ప్రదర్శించారు. తమ ప్రదర్శనల ఉద్దేశం, తయారీ విధానం, ఉపయోగాలను విద్యార్థులు వివరించిన తీరు ఆకట్టుకుంది. రాష్ట్రంలోని 8 విభాగాల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ మేళాలో పాల్గొన్నారు. ఆయా విభాగాలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. దీంతో మేళా ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.

ప్రదర్శనలను పరిశీలించిన న్యాయ నిర్ణేతలు..

వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల నుంచి న్యాయ నిర్ణేతలుగా విచ్చేసిన నిపుణులు విద్యార్థుల ప్రదర్శనలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ప్రాజెక్టుల వివరాలను తెలుసుకున్నారు. ప్రదర్శనల వెనుక ఉన్న ఆలోచన, శాస్త్రీయ విధానం, సృజనాత్మకత తదితర అంశాలను పరిశీలించి మూల్యాంకనం చేశారు. కార్యక్రమానికి ముధోల్ మండల విద్యాధికారి గోపిడి రమణారెడ్డి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించేందుకు విచ్చేసిన న్యాయ నిర్ణేతలను కూడా నిర్వాహకులు శాలువాలతో సన్మానించారు.

శాస్త్రీయ దృక్పథానికి దోహదం..

విద్యార్థుల్లో గణితం, విజ్ఞానశాస్త్రాలపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు సృజనాత్మక ఆలోచన, పరిశోధనా దృక్పథం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇటువంటి మేళాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి మేళా ముధోల్‌లో నిర్వహించడంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News