Sowjanya Anneboina August 23, 2026prabhanews.com
సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మేఘావత్ రెడ్యా నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
తనపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రజలకు సక్రమంగా అందేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును కమిటీ దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పనిచేస్తానని రెడ్యా నాయక్ పేర్కొన్నారు.
