Rama Rao September 2, 2026Telangana
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, లక్కారం గ్రామపంచాయతీల పరిధిలో ఆశా వర్కర్లు వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.
బుధవారం లక్కారం గంగన్నపేట పంచాయతీలోని పలు వార్డుల్లో సర్వే ప్రారంభించారు. ఆశా వర్కర్లు ఇంటింటికీ తిరుగుతూ కుటుంబాల్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా అని ఆరా తీస్తూ వారి పేర్లను నమోదు చేస్తున్నారు. సర్వే నిర్వహించినట్లు ఇళ్ల ముఖద్వారాలపై గుర్తులు వేస్తున్నారు. వ్యాధుల నియంత్రణలో భాగంగా మురుగు కాల్వల్లో లార్వా దోమల నివారణకు మందును సైతం పిచికారీ చేస్తున్నారు.
ఉన్నతాధికారులు, వైద్యాధికారుల ఆదేశాల మేరకు ఆశా వర్కర్లు ఇంటింటికీ తిరుగుతూ జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. వ్యాధుల వ్యాప్తికి కారణాలను గుర్తించడంతో పాటు దోమల లార్వా నివారణకు చర్యలు చేపడుతున్నారు. సర్వేలో జ్వరపీడితుల వివరాలను నమోదు చేసి వైద్య సిబ్బందికి సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యాధుల నిర్మూలనలో భాగంగా సర్వే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
