Dailyhunt
భారత్‌కు గుడ్‌న్యూస్.. ఇక చమురు, గ్యాస్ కొరత ఉండదు..

భారత్‌కు గుడ్‌న్యూస్.. ఇక చమురు, గ్యాస్ కొరత ఉండదు..

RTV News 0 months ago

శ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ముదురుతున్న నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ గుడ్న్యూస్ అందింది. భారత్కు ముడి చమురు, సహజ వాయువు సరఫరాను మరింత పెంచేందుకు రష్యా ముందుకొచ్చింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలసిందే. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్లతో వరుస భేటీలు నిర్వహించింది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో చమురు కొరత కలవరపెడుతున్న వేళ.. భారత్కు ముడి చమురు, సహజ వాయువు సరఫరాను మరింత పెంచుతామని రష్యా హామీ ఇచ్చింది.

సినిమా రేంజ్లో ట్విస్ట్.. తాళి కట్టే సమయంలో పెళ్లి ఇష్టం లేదన్న వధువు.. వరుడు ఏం చేశాడంటే ?

ఇదిలాఉండగా పశ్చిమాసియాలో యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధి వద్ద అంతరాయం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నమైంది. అందుకే విదేశాల నుంచి ఇంధన దిగుమతులపై ఆధారపడే భారత్ లాంటి దేశాలకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రష్యా ముందుకొచ్చింది. అంతేకాదు ఈ భేటీలో చమురుతో పాటు ఎరువులు, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని విస్తరించడం గురించి చర్చలు జరిగాయి.

దేశభక్తిని చాటుకున్న సీమా హైదర్.. కొడుకుకు 'భరత్' అనే పేరుతో నామకరణం

గతేడాది కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సమీక్ష, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. మొత్తానికి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న వేళ రష్యా నుంచి అదనపు సరఫరా హామీ రావడం భారత్కు ఊరటనిస్తోంది. మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu