పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికాకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా రెస్క్యూ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ IRGC ప్రకటన చేసింది.
ఇటీవల F15E ఫైటర్ జెట్ ఇరాన్‌లో కూలడంతో ఓ పైలట్ గల్లంతైన సంగతి తెలిసిందే. దీంతో అతడిని రక్షించామంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే ఆ పైలట్ కోసం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న విమానాన్ని కూల్చేశామని IRGC తెలిపింది.
భారత్ దాడి చేస్తే.. యుద్ధాన్ని కోల్‌కతా వరకు తీసుకెళ్తాం.. పాక్ మంత్రి బలుపు మాటలు!
పైలట్ కోసం గాలిస్తున్న అమెరికాకు చెందిన విమానాన్ని ఇస్ఫహాన్ దక్షిణ ప్రాంతంలో IRGC దళాలు ధ్వంసం చేశాయని ఇరాన్ తెలిపింది. ఆ ఎయిర్‌క్రాఫ్ట్ అమెరికా వైమానిక దళానికి చెందిన C130గా పేర్కొంది. ఫరాజ్ రేంజర్స్ అనే పోలీసు కమాండో యూనిట్ విమానాన్ని ధ్వంసం చేసినట్లు ఖతార్ మీడియా తెలిపింది. ఇతర ఫైటర్‌జెట్లకు రీఫ్యూయలింగ్ చేసేందుకు C130 వచ్చిందని చెప్పింది. అయితే ఇందులో ఉన్న సిబ్బందికి సంబంధించి సమాచారంపై క్లారిటీ లేదు.
వాషింగ్టన్ మేయర్ బరిలో తమిళనాడు మహిళ.. ఎవరీ రిని సంపత్ !
మరోవైపు అమెరికా కూడా ఈ దాడికి సంబంధించి ప్రకటన చేయలేదు. ఇదిలాఉండగా ఇటీవల అమెరికాకు చెందిన F15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ పైలట్ గల్లంతయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా దళాలు అతడిని రక్షించాయి. పైలట్ కోసం ఆపరేషన్ చేసి విజయం సాధించామని ట్రంప్ తెలిపారు. తమ బలగాల వద్దే ఆ పైలట్ ఉన్నట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ కోసం డజన్ల కొద్ది విమానాలను పంపిస్తున్నామని చెప్పారు.

