Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pakistan: పాక్‌లో కుప్పకూలిన JF-17 యుద్ధ విమానం.. ప్రాణాలతో బయటపడ్డ పైలట్లు!

Pakistan: పాక్‌లో కుప్పకూలిన JF-17 యుద్ధ విమానం.. ప్రాణాలతో బయటపడ్డ పైలట్లు!

RTV News 3 days ago

పాకిస్తాన్లోని కామ్రాలో పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ (PAC) దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక సాధారణ శిక్షణా మిషన్ సందర్భంగా పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన 'జేఎఫ్-17 థండర్' ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలింది.

విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. విమానం కూలిపోయేందుకు కొద్ది క్షణాల ముందు ఇద్దరు పైలట్లు పారాచూట్ల సాయంతో బయటకు దూకేశారు. దీంతో వాళ్లకి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జనావాసాలు లేని ప్రాంతంలో జరగడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.

కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన.. ఆ మంత్రులు అవుట్

అయితే ఈ ప్రమాదానికి ముందు విమానం టేకాఫ్ అవ్వడం, ఆ తర్వాత పైలట్లు పారాచూట్లతో కిందకు దిగడం, విమాన శిథిలాల నుంచి దట్టమైన పొగ పైకి లేవడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రక్షక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ పైలట్లను ఆస్పత్రికి తరలించారు. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో చైనా తయారీ యుద్ధ విమానాలు కూలిపోవడం ఇది ఏడవసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వరుస ప్రమాదాలు చైనాపై ఆధారపడుతున్న పాకిస్తాన్ వైమానిక దళ సామర్థ్యాన్ని, వాటి నిర్వహణ లోపాలను మరోసారి ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

రాబోయే పదేళ్లలో వంద ఎయిర్పోర్టులు.. కేంద్రమంత్రి కింజరాపు కీలక ప్రకటన

మరోవైపు వివాదానికి కేంద్రంగా ఉన్న 'JF-17 థండర్' యుద్ధ విమానాన్ని పాకిస్తాన్, చైనాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది ఒకే ఇంజిన్ కలిగిన తేలికపాటి యుద్ధ విమానం. దీన్ని బహుళ ప్రయోజన యుద్ధ విమానంగా కూడా పిలుస్తారు. ఆకాశంలో శత్రువులను నిరోధించడం, భూతల, సముద్ర దాడులు చేయడం, గూఢచర్యం లాంటి క్లిష్టమైన మిషన్ల కోసం పాక్ దీన్ని వాడుతోంది. అయినాకూడా చైనా టెక్నాలజీ వల్ల తయారైన ఈ విమానాల్లో తరచూ వస్తున్న సాంకేతిక లోపాలు, నాణ్యతా లోపాలు ప్రస్తుతం పాక్ రక్షణ రంగానికి సవాలుగా మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu