Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Weather Alert: తెలంగాణకు ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు..

Weather Alert: తెలంగాణకు ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు..

RTV News 1 week ago

ఏడాది తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రానున్నాయి. గతేడాదితో పోలిస్తే నాలుగు నుంచి ఐదు రోజులు ఆలస్యంగా రానున్నట్లు భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది.

జూన్ మొదటి వారంలో ఇవి రాష్ట్రంలోకి ప్రవేశించే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది. మే 26న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకనున్నాయని.. ఆ తర్వాత సాధారణంగా 4 నుంచి 7 రోజుల్లో తెలంగాణ సరిహద్దుల్లోకి చేరుకుంటాయని అధికారులు తెలిపారు.

ఎబోలా వైరస్ సోకి 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులతో పాటు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఇంది ముందుకు వెళ్లేందుకు వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక రాష్ట్రంలో ఇంకా ఎండలు మండుతూనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల దాకా అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

61 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. భారతీయుడికి 13 ఏళ్ల జైలుశిక్ష

గత శనివారం ఆదిలాబాద్లో అత్యధికంగా 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రానున్న రోజుల్లో వడగాల్పులు వీచే ప్రమాదం పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేశారు. మరోవైపు నైరుతి బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఆదివారం జోగులాంబ గద్వాల్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu