Dailyhunt
బడ్జెట్‌ ను ఫిబ్రవరి 1నే ఎందుకు ప్రవేశపెడతారో తెలుసా..?

బడ్జెట్‌ ను ఫిబ్రవరి 1నే ఎందుకు ప్రవేశపెడతారో తెలుసా..?

SAKSHI EDUCATION 2 months ago

  • నిజానికి ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టేవారు కాదు. గతంలో ఫిబ్రవరి చివరిలో ప్రవేశపెట్టేవారు. 2016 వరకు, భారతదేశం బిటిష్‌ కాలం నాటి విధానంలోనే..ఫిబ్రవరి చివరి పనిదినాన బడ్జెట్‌ను ప్రవేశపెట్టేది.

  • దీనివల్ల ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1న ప్రారంభమవుతుంది. దాంతో మంత్రిత్వ శాఖలు, వ్యాపారాలు, పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాలు, పన్ను నిబంధనలపై చర్యలు తీసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉండేంది.
  • బడ్జెట్ ఆమోదం పొంది, అమలులోకి వచ్చేసరికి, కొత్త ఆర్థిక సంవత్సరం అప్పటికే ప్రారంభమైపోయేది. ఫలితంగా, అనేక ప్రభుత్వ ప్రణాళికలు, విధానాలు సమయానికి ప్రారంభమయ్యేవి కావు, ఆలస్యమయ్యేవి.
  • 2017లో, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారిగా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి, ప్రభుత్వం ఈ ముందస్తు తేదీనే కొనసాగిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేలోపు అందరికీ ప్రణాళికలు వేసుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వడమే దీని ప్రదాన లక్ష్యం.
  • అదేవిధంగా, వలసవాద కాలం నుంచి అనుసరిస్తున్న బడ్జెట్ సమయాన్ని కూడా మార్చారు. 1999 వరకు, బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు.
  • అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా, ఎక్కువ మీడియా కవరేజ, మెరుగైన ప్రజా భాగస్వామ్యం కోసం సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు.
  • ప్రభుత్వం ఈ మార్పును ప్రకటించిన వెంటనే, ఈ చర్యను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.
  • రాష్ట్ర ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రజాకర్షక వాగ్దానాలు చేయడానికి బడ్జెట్‌ను ముందుగా ప్రవేశపెట్టడం ఒక అవకాశాన్ని ఇస్తుందని పిటిషనర్ వాదించారు.
  • సంబంధించిన విషయం కాదని, ఇది యావత్తు దేశానికి సంబంధించిన విషయమని పేర్కొంటూ సుప్రీంకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.
  • పైగా కేంద్ర బడ్జెట్‌కు రాష్ట్రాలతో ఎలాంటి సంబంధం లేదు. పైగా రాష్ట్ర ఎన్నికల కారణంగా కేంద్రం పనితీరుకు ఆటంకం కలిగించదు" అని ధర్మాసనం స్పష్టం చేసింది.
  • అలా అప్పటి నుంచి ఫిబ్రవరి 1నే ఆర్థికమంత్రి కేంద్ర బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం ఆనావాయితీగా మారింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education