Dailyhunt
దేశంలోనే తొలి సోలార్ బోట్..ఎక్కడో తెలుసా ?

దేశంలోనే తొలి సోలార్ బోట్..ఎక్కడో తెలుసా ?

SAKSHI EDUCATION 2 months ago
  • కేరళ.. ప్రకృతి అందాలకు నెలవు. పర్యావరణ పరంగా కేరళలో సరస్సులు, కాల్వలు, సముద్రతీరపు నీటి మార్గాలు ఎక్కువ. అందుకే అక్కడ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే పడవ ప్రయాణం తప్పని సరి.
  • అదే సమయంలో కొబ్బరిపీచు, జీడిపప్పు, ఇటుక తయారీ, చేపల వేట వంటి సంప్రదాయ వృత్తులు సైతం నీటి మార్గాల పక్కన ఎక్కువగా ఉండంటం వల్ల రవాణా అవసరాలు పడవల ద్వారా జరుగుతుంటాయి.
  • రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి, పర్యావరణహిత రవాణా మార్గంగా పడవ ప్రయాణాలు సజావుగా జరిగేలా ప్రభుత్వం పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దింది.
  • ఇందులో భాగంగా వైకోమ్ పట్టణంలో ఇంధనంతో నడిచే పడవల స్థానంలో సోలార్‌తో నడిచే పడవల్ని ప్రారంభించింది.
  • ఈ సందర్భంగా మంత్రి సి.బి. గణేష్ కుమార్ మాట్లాడుతూ.. వైకోమ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా అవతరించింది. ఇది కేరళ పర్యావరణహిత రవాణా రంగానికి మరో కలికితురాయి'అని పేర్కొన్నారు.
  • ఇక ఈ జల రవాణా కేంద్రంలోని ఒక్కో పడవలో 75 మంది ప్రయాణించొచ్చు.
  • 3.15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పడవలు 80 కిలోవాట్ల శక్తి సామర్థ్యంతో నడుస్తాయి.
  • మొత్తం 10.8 కిలోమీటర్ల మార్గంలో ఈ పడవలు సేవలు అందించనున్నాయి.
  • రోజుకు 15 ప్రయాణాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.
  • ఈ ప్రాజెక్ట్‌ ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గి, పర్యాటక రంగానికి కూడా ఊతం లభించనుంది.
  • 2017లో వైకోమ్‌లో మొదటి సౌర పడవను ప్రవేశపెట్టిన తర్వాత, ఇప్పుడు ఈ కేంద్రం పూర్తిగా సౌరశక్తి ఆధారితంగా మారడం కేరళలో స్థిరమైన రవాణా పరిష్కారాల వైపు ఒక పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు.

1. దేశంలోనే మొట్టమొదటి సోలార్ ఆధారిత పడవ రవాణా హబ్‌ను కేరళలో ఎక్కడ ప్రారంభించారు?
1. కొచ్చి
2. వైకోమ్
3. అలప్పుజ
4. తిరువనంతపురం

1. కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణహిత ఇంధనాలను వాడటం.
2. కేవలం బొగ్గును మాత్రమే వాడటం.
3. పడవల వేగాన్ని పెంచడం.
4. రోడ్డు రవాణాను పూర్తిగా నిలిపివేయడం.

1. వైకోమ్ దేశంలోనే తొలి సౌర పడవ రవాణా కేంద్రం.
2. ఈ పడవల వల్ల పర్యాటక రంగానికి ఊతం లభిస్తుంది.
3. ఈ పడవలు పెట్రోల్ తో నడుస్తాయి.
4. ఇది స్థిరమైన (Sustainable) రవాణా పరిష్కారం.

1. వైకోమ్
2. కొచ్చి
3. కొల్లాం
4. కన్నూర్

1. రవాణా మంత్రిత్వ శాఖ
2. విద్యుత్ మంత్రిత్వ శాఖ
3. పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ (MNRE)
4. హోం శాఖ

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education