Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏఐ యూనివర్సిటీ..మంత్రిత్వ శాఖ..జాతీయ ఏఐ నిధి ఏర్పాటు..?

ఏఐ యూనివర్సిటీ..మంత్రిత్వ శాఖ..జాతీయ ఏఐ నిధి ఏర్పాటు..?

SAKSHI EDUCATION 8 months ago
  • మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్‌ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తుచేశారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది కేవలం ఇంకొక టెక్నాలజీ కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
  • మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని అన్నారు. రోబోటిక్స్‌తో కలిసినప్పుడు యంత్రాలు మానవ మేధస్సుతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయని చెప్పారు.
  • ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు.
  • గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ, ఈసారి భారత్‌ అలాంటి తప్పిదం చేయకూడదని హెచ్చరించారు.
  • సేవలు, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచ స్థాయి కోర్‌ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలని సూచించారు.
  • దేశానికి తక్షణ జాతీయ ఏఐ రోడ్‌మ్యాప్‌ అవసరమని నొక్కిచెప్పారు. ఏఐ అభివృద్ధి ప్రతి దశలో భారత్‌ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని అన్నారు.
  • ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో జాతీయ 'ఏఐ వార్‌ రూమ్‌'ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
  • కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో అలాంటి వార్‌ రూమ్‌ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు.
  • ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సీఎం కోరారు.
  • ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై ఉద్భవిస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చని, అయితే సరైన రీ స్కిల్లింగ్, అప్‌ స్కిల్లింగ్‌ చర్యల ద్వారా ఏఐ సృష్టించే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
  • యువతను ఏఐ ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.
  • స్టార్టప్‌లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
  • దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే 'ఏఐ స్టార్టప్‌ విలేజ్‌'ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు.
  • ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు.
  • ఏఐ అభివృద్ధి, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలని సూచించారు.
  • బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్‌ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

1. అలాన్ ట్యూరింగ్ (Alan Turing)
2. జాన్ మెక్కార్తీ (John McCarthy)
3. మార్విన్ మిన్స్కీ (Marvin Minsky)
4. హెర్బర్ట్ సైమన్ (Herbert Simon)

1. ఐజాక్ అసిమోవ్
2. ఎలోన్ మస్క్
3. అలాన్ ట్యూరింగ్
4. జెఫ్రీ హింటన్


జాబితా-I (రకం) జాబితా-II (వివరణ)

a. Narrow AI i. మానవుడికి సమానమైన మేధస్సు గల యంత్రం (ఊహాత్మకం)
b. General AI ii. ఒక నిర్దిష్ట పని కోసం మాత్రమే రూపొందించబడినది
c. Super AI iii. మానవ మేధస్సును మించిన సామర్థ్యం
1. a-i, b-ii, c-iii
2. a-ii, b-i, c-iii
3. a-iii, b-ii, c-i
4. a-ii, b-iii, c-i

ప్రకటన (i): ఎన్‌ఎల్‌పి (NLP - Natural Language Processing) అనేది కంప్యూటర్లు మానవ భాషను అర్థం చేసుకోవడానికి సహకరిస్తుంది.
ప్రకటన (ii): అలెక్సా (Alexa), సిరి (Siri) వంటివి ఎన్‌ఎల్‌పి సాంకేతికతను ఉపయోగిస్తాయి.
1. (i) మాత్రమే సరైనది
2. (ii) మాత్రమే సరైనది
3. రెండూ సరైనవే
4. రెండూ తప్పు

A) ప్రత్యేక ఏఐ (AI) మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
B) జాతీయ స్థాయిలో 'ఏఐ వార్ రూమ్'ను ఏర్పాటు చేయాలి.
C) హైదరాబాద్‌లో 'ఏఐ స్టార్టప్ విలేజ్' ఏర్పాటుకు సంసిద్ధత.
1. A మరియు B మాత్రమే
2. B మరియు C మాత్రమే
3. A మరియు C మాత్రమే
4. పైవన్నీ సరైనవే

☛Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Facebook Page (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education