Dailyhunt
ఈ బటన్ తో సైబర్ మోసాలకు చెక్ పెట్టొచ్చు..అదేంటో తెలుసుకోండి..!

ఈ బటన్ తో సైబర్ మోసాలకు చెక్ పెట్టొచ్చు..అదేంటో తెలుసుకోండి..!

SAKSHI EDUCATION 2 months ago
  • నేతృత్వం: కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి
  • కేంద్ర న్యాయ, ఐటీ-టెలీ కమ్యూనికేషన్లు, వినియోగదారుల వ్యవహారాల శాఖలు, ఆర్బీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇండియన్‌ సైబర్‌ క్రైం కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ తన సిఫార్సులను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. 'కిల్‌ స్విచ్‌' సాధనాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు సైబర్‌ క్రైం నేరాలకు బీమా సౌకర్యం కల్పించాలని కూడా ప్రతిపాదించారు.

  • ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, డిజిటల్‌ చెల్లింపులు, యూపీఐ చెల్లింపుల విధానంలో ఈ 'కిల్‌ స్విచ్‌' అనే బటన్‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర హోంశాఖ కమిటీ ప్రతిపాదించింది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి సంతృప్తి వ్యక్తంచేసింది.
  • కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లలోని బ్యాంకింగ్‌ యాప్‌లు, యూపీఐ యాప్‌లలో ఈ 'కిల్‌ స్విచ్‌' బటన్‌ను ఏర్పాటుచేస్తారు. డిజిటల్‌ అరెస్టు, ఇతర సైబర్‌ నేరాల బారిన పడ్డామని గుర్తించగానే ఆ 'కిల్‌ స్విచ్‌' బటన్‌ను నొక్కి­తే చాలు.. వారి అన్ని బ్యాంకు ఖాతాలు వెంటనే స్తంభించిపోతాయి.
  • ఆ ఖాతాల నుంచి ఇతర ఖాతా­లకు నగదు బదిలీగానీ ఇతర లావాదేవీలుగానీ సాధ్యంకాదు. దీంతో.. సైబర్‌ నేర ముఠాలు బెదిరింపులకు పాల్పడి సామాన్యుల బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ చేయించుకోవడానికి అడ్డుకట్ట వెయ్యొ­చ్చని కేంద్ర హోంశాఖ కమిటీ భావిస్తోంది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంతోపాటు సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇదే అంశంపై ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రతినిధులతో కూడా సమావేశం నిర్వహించింది.
  • సైబర్‌ నేరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. బ్యాంకు ఖాతాలు ఉన్నవారు బీమా చేసుకుంటే.. సైబర్‌ నేరాలకు గురైతే బీమా పరిహారం పొందవచ్చు. ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ దేశంలోని జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలతో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
  • దేశంలో సైబర్‌ నేర ముఠాలు 2024-25లో దేశంలో రూ.34,771 కోట్లు కొల్లగొట్టాయి.
  • డిజిటల్‌ అరెస్టులని బెదిరించి వీడియో కాల్స్‌లో గంటల తరబడి బంధించి రూ.3 వేల కోట్లు దోచుకున్నాయి. దీంతో.. తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది.
  • డిజిటల్‌ అరెస్టులు, సైబర్‌ నేరాల కట్టడికి ఎలాంటి చర్యలు చేపడతారో చెప్పాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఫలితంగా.. కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది.
  • ఈ 'కిల్‌ స్విచ్‌' బటన్‌ ఏర్పాటు, సైబర్‌ నేరాలకు బీమా భద్రతతోపాటు మరికొన్ని అంశాలను ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు పరిశీలన అనంతరం కేంద్ర హోంశాఖ తదుపరి కార్యాచరణ చేపడుతుంది.
  1. ఇది డిజిటల్ లావాదేవీల సమయంలో సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించగానే వినియోగదారుడు తన ఖాతాలను తక్షణమే స్తంభించేలా చేస్తుంది.
  2. ఈ బటన్‌ను కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకుల యాప్‌లలో మాత్రమే ప్రవేశపెట్టాలని కమిటీ సిఫార్సు చేసింది.
  3. సైబర్ నేరాలను బీమా పరిధిలోకి తీసుకురావడం కూడా ఈ కమిటీ సిఫార్సులలో ఒక భాగం.

పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి?
A) 1 మరియు 2 మాత్రమే
B) 2 మరియు 3 మాత్రమే
C) 1 మరియు 3 మాత్రమే
D) 1, 2 మరియు 3

జాబితా-I (సంస్థ) జాబితా-II (ప్రధాన బాధ్యత)
a. I4C 1. సైబర్ నేరాల కట్టడికి రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయం
b. NIA 2. ఉగ్రవాద సంబంధిత సైబర్ దాడుల దర్యాప్తు
c. RBI 3. బ్యాంకింగ్ మరియు ఆర్థిక లావాదేవీల నియంత్రణ
d. CERT-In 4. కంప్యూటర్ అత్యవసర స్పందన మరియు సైబర్ భద్రత
సరైన కోడ్‌ను ఎంచుకోండి:
A) a-1, b-2, c-3, d-4
B) a-2, b-1, c-4, d-3
C) a-1, b-3, c-2, d-4
D) a-4, b-2, c-3, d-1

A) నేరగాళ్లు వర్చువల్ పద్ధతిలో పోలీసుల నుండి తప్పించుకోవడం.
B) చట్టబద్ధమైన ఏజెన్సీల పేరుతో బాధితులను వీడియో కాల్స్‌లో గంటల తరబడి బంధించి భయపెట్టి డబ్బులు వసూలు చేయడం.
C) ప్రభుత్వ వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసి డేటాను స్తంభింపజేయడం.
D) సైబర్ నేరగాళ్లను పోలీసులు ఇంటర్నెట్ ఆధారంగా అరెస్ట్ చేయడం.

  1. ఇది వినియోగదారుడికి తన ఆర్థిక డేటాపై 'స్వయం-నియంత్రణ' (Self-regulation) అధికారాన్ని కల్పిస్తుంది.
  2. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే, బాధితుడు ఫిర్యాదు చేసిన తర్వాత బ్యాంకులు స్పందించే లోపే జరిగే 'గోల్డెన్ అవర్' (Golden Hour) నష్టాన్ని అరికట్టవచ్చు.
  3. ఈ ఫీచర్ కేవలం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మాత్రమే కాకుండా, ఫీచర్ ఫోన్‌ల ద్వారా యూఎస్‌ఎస్‌డీ (USSD) వాడే వారికి కూడా అందుబాటులో ఉండేలా ప్రతిపాదించారు.

పై వాటిలో సరైనవి ఏవి?
A) 1 మరియు 2 మాత్రమే
B) 2 మరియు 3 మాత్రమే
C) 1 మరియు 3 మాత్రమే
D) 1, 2 మరియు 3

A) ఇది రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే గూఢచారి సంస్థ.
B) ఇది సైబర్ నేరాల విచారణ కోసం ప్రత్యేకంగా కేటాయించబడిన జాతీయ న్యాయస్థానం.
C) సైబర్ నేరాల బాధితులు ఫిర్యాదు చేయడానికి '1930' హెల్ప్‌లైన్ మరియు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను ఇది నిర్వహిస్తుంది.
D) ఇది కేవలం అంతర్జాతీయ సైబర్ దాడులను మాత్రమే పర్యవేక్షిస్తుంది.

నేరం రకం వివరణ
a. విషింగ్ (Vishing) 1. ఈమెయిల్స్ ద్వారా నకిలీ వెబ్‌సైట్ లింకులు పంపి సమాచారం దొంగిలించడం.
b. ఫిషింగ్ (Phishing) 2. ఫోన్ కాల్స్ ద్వారా వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలు సేకరించడం.
c. రాన్సమ్ వేర్ (Ransomware) 3. సిస్టమ్ డేటాను లాక్ చేసి, అన్‌లాక్ చేయడానికి డబ్బు డిమాండ్ చేయడం.
d. స్మిషింగ్ (Smishing) 4. ఎస్ఎంఎస్ (SMS) ద్వారా మోసపూరిత లింకులు పంపడం.
సరైన కోడ్‌ను ఎంచుకోండి:
A) a-1, b-2, c-3, d-4
B) a-2, b-1, c-3, d-4
C) a-2, b-4, c-3, d-1
D) a-4, b-1, c-2, d-3

A) ఇది బాధితుల ఖాతాల నుంచి నిధుల తరలింపును తక్షణమే నిరోధించడానికి రూపొందించబడింది.
B) ఈ బటన్‌ను నొక్కిన వెంటనే బాధితుడి అన్ని అనుసంధానిత బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అవుతాయి.
C) కిల్ స్విచ్‌ను ఒకసారి నొక్కిన తర్వాత, ఖాతాను మళ్లీ పునరుద్ధరించడం సాధ్యం కాదు.
D) బ్యాంకింగ్ యాప్‌లు మరియు యూపీఐ ఇంటర్‌ఫేస్‌లలో ఈ ఫీచర్‌ను చేర్చాలని కమిటీ ప్రతిపాదించింది.

  1. సైబర్ నేరాలను బీమా (Cyber Insurance) పరిధిలోకి తీసుకురావడం.
  2. డిజిటల్ చెల్లింపుల గేట్‌వేలలో అదనపు భద్రతా పొరలను (Multilayer security) ఏర్పాటు చేయడం.
  3. సైబర్ నేరగాళ్ల ఆస్తులను తక్షణమే వేలం వేసి బాధితులకు పరిహారం అందించడం.

పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి?
A) 1 మరియు 2 మాత్రమే
B) 2 మరియు 3 మాత్రమే
C) 1 మరియు 3 మాత్రమే
D) 1, 2 మరియు 3

  1. ఇది కేంద్ర హోంశాఖ (MHA) ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
  2. ఇది రాష్ట్ర పోలీసు బలగాల మధ్య సైబర్ నేరాల పరిశోధనలో సమన్వయం పెంచుతుంది.
  3. ఇది కేవలం సామాజిక మాధ్యమాల్లో (Social Media) జరిగే నేరాలను మాత్రమే పర్యవేక్షిస్తుంది.

సరైనవి ఏవి?
A) 1 మాత్రమే
B) 2 మరియు 3 మాత్రమే
C) 1 మరియు 2 మాత్రమే
D) 1, 2 మరియు 3

A) నేరగాడు జైలు నుంచి విడుదలయ్యే సమయం.
B) మోసం జరిగిన మొదటి 1-2 గంటల్లో ఫిర్యాదు చేస్తే నగదును రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉండటం.
C) సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయ్యే సమయం.
D) బ్యాంకు సెలవు దినాలలో లావాదేవీలు నిలిచిపోయే సమయం.

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education