Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..

యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..

SAKSHI EDUCATION 8 months ago

  • అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్‌ కంటెంట్ భారతీయ కంటెంట్ క్రియేటర్లను గ్లోబల్ సెలబ్రిటీలుగా మార్చేందుకు గూగుల్, యూట్యూబ్, మెటా, అడోబ్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి టెక్ దిగ్గజాలతో ఐఐసీటీ కీలక ఒప్పందాలు చేసుకుంది.

  • దీనివల్ల క్రియేటర్లకు కేవలం వ్యూస్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి ఇంటర్న్‌షిప్‌లు, స్కాలర్‌షిప్‌లు, మెంటర్షిప్ లభించనున్నాయి.
  • దక్షిణ కొరియా మాదిరిగా భారత్‌ను గ్లోబల్ కంటెంట్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా వేవ్‌ఎక్స్ (WaveX) ఇన్‌క్యుబేటర్ ద్వారా స్టార్టప్‌లకు ప్రపంచస్థాయి శిక్షణ ఇవ్వనున్నారు.
  • సృజనాత్మక రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు ప్రభుత్వం కొత్తగా 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్' (ఎన్‌ఐడీ)ను ఏర్పాటు చేయనుంది.
  • ఇది 'ఛాలెంజ్ రూట్' ద్వారా ఏర్పాటు కానుంది. దీనితో పాటు పారిశ్రామిక కారిడార్ల సమీపంలో ఐదు యూనివర్సిటీ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది.
  • ఇక్కడ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు ఒకే చోట ఉండటం వల్ల క్రియేటివ్ రంగంలో పరిశోధనలకు పెద్దపీట వేసినట్లవుతుంది.
  • ఈ బడ్జెట్ ప్రతిపాదనలతో యూట్యూబర్లు, డిజిటల్ క్రియేటర్లకు అద్భుతమైన అవకాశాలు రానున్నాయి.
  • ప్రభుత్వ ల్యాబ్‌లలో హై-ఎండ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంత క్రియేటర్లకు కూడా ప్రొఫెషనల్ క్వాలిటీ కంటెంట్ రూపొందించే అవకాశం దక్కుతుంది.
  • అలాగే టెక్ దిగ్గజాలతో కుదిరిన ఒప్పందాల వల్ల తమ ఛానల్స్‌ను మరింతగా మానిటైజ్ చేసుకోవడానికి, మెరుగైన అల్గారిథమ్ సపోర్ట్ పొందడానికి మార్గం సుగమం కానుంది.
  • సాధారణంగా ఒక యూట్యూబర్ హై-క్వాలిటీ వీడియోలు చేయాలంటే లక్షల రూపాయల విలువైన ఎడిటింగ్ సిస్టమ్స్, కెమెరాలు, సాఫ్ట్‌వేర్ అవసరం అవుతుంది.
  • ఐఐసీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వేల కంటెంట్ ల్యాబ్‌లు ఈ సమస్యను పరిష్కరిస్తాయి.
  • ఇక్కడ క్రియేటర్లకు ఏఐ టూల్స్, హై-ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్న కంప్యూటర్లు, లైసెన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంటుంది. ఇది ముఖ్యంగా చిన్న పట్టణాల్లోని క్రియేటర్లకు వరంగా మారనుంది.
  • గూగుల్, యూట్యూబ్, మెటా వంటి సంస్థలతో ఐఐసీటీ ఒప్పందం చేసుకోవడంతో వల్ల యూట్యూబర్లకు కేవలం 'వ్యూస్' ఎలా పెంచుకోవాలో మాత్రమే కాకుండా, యాడ్ రెవెన్యూను ఎలా పెంచుకోవాలి?, కాపీరైట్ ఇష్యూస్ లేకుండా ఎలా ఉండాలో నేరుగా ఆయా సంస్థల ప్రతినిధుల నుండే శిక్షణ అందనుంది.
  • అలాగే లైవ్ స్ట్రీమింగ్ చేసే గేమర్లకు కొత్త టెక్నాలజీపై మరింత అవగాహన పెరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ 'కంటెంట్ క్రియేషన్‌'ను ఒక గౌరవప్రదమైన వృత్తిగా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నది.

☛Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Facebook Page (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education