Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Good News: 7,000 ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్!

Good News: 7,000 ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్!

SAKSHI EDUCATION 3 weeks ago

ప్పటికే 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో, మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ప్రస్తుతం అదనంగా 2,000 పోలీస్ పోస్టుల భర్తీ ప్రతిపాదన ఆర్థిక శాఖ (Finance Department) పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ఈ పోస్టులకు కూడా త్వరలో గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

రైల్వేలో 6,557 టెక్నీషియన్ ఉద్యోగాలు.. BSc, ITI అర్హతతో భారీ అవకాశం.. పూర్తి వివరాలు ఇవే!

ఇప్పటికే ఆమోదం పొందిన 5,000 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, నోటిఫికేషన్ వెలువడేలోపు పెండింగ్‌లో ఉన్న 2,000 పోస్టులకు కూడా ఆమోదం లభిస్తే, వాటిని అదే నోటిఫికేషన్‌లో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో మొత్తం 7,000 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

NEEPCOలో 38 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు జీతం!

అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఒకటి లేదా రెండు రోజుల్లో పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే పోస్టుల సంఖ్య, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు తేదీలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం లభిస్తే, రాష్ట్రంలో ఇటీవలి కాలంలో అత్యధిక సంఖ్యలో పోలీస్ ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉంది. దీంతో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు ఇది శుభవార్తగా మారనుంది.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education