Dailyhunt
ఇరాన్‌ vs ఇజ్రాయెల్..యుద్ధానికి అసలు కారణమిదే..!

ఇరాన్‌ vs ఇజ్రాయెల్..యుద్ధానికి అసలు కారణమిదే..!

SAKSHI EDUCATION 2 months ago

దీంతో ఇజ్రాయెల్ & అమెరికా ఉమ్మడిగా ఇరాన్‌పై భీకర దాడులు ప్రారంభించడంతో పశ్చిమ ఆసియాలో యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

  • దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
  • అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ 35కు పైగా బాలిస్టిక్ మిస్సైళ్లతో ఉత్తర ఇజ్రాయెల్‌పై ఎదురుదాడికి దిగింది.
  • ఇక్కడి భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక రాయబార కార్యాలయ సూచనలను పాటించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.
  • ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమంపై అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఆ ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చర్చలు జరిగిన కొన్ని గంటల్లోనే దాడులు ప్రారంభమవ్వడం గమనార్హం.
  • ఇరాన్ నుంచి భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతాపరమైన బెదిరింపులను ముందే అడ్డుకోవాలని ఇజ్రాయెల్ ఈ వైమానిక దాడులను "ముందస్తు" చర్యగా అభివర్ణించింది.
  • ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలు & మద్దతుదారుల ద్వారా ఇజ్రాయెల్‌ను నిరంతరం బెదిరిస్తోందని, ఆ బెదిరింపులను నిలువరించడమే తమ ప్రాథమిక లక్ష్యమని ఇజ్రాయెల్ రక్షణ శాఖ పేర్కొంది.
  • "యుద్ధం మీరు ప్రారంభించారు, ముగింపు తాము పలుకుతాం" అంటూ ఇరాన్ చేసిన హెచ్చరికలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన మార్గాలను మూసివేసి, సైనిక చర్యలకు దారితీశాయి.

ప్రస్తుతం ఇరాన్ తన వైమానిక ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి, మరింత తీవ్రమైన ప్రతిదాడులకు సిద్ధమవుతోంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education