- అయితే, వీరిలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.
- ఎగువ సభకు ఆమె ఎన్నికైతే పార్లమెంట్ చరిత్రలోనే తొలి LGBTQ+ పార్లమెంట్ సభ్యురాలు అవుతారు.
-
- కాగా.. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో అయిదు స్థానాలు ఖాళీ అవుతుండగా.. నాలుగు టీఎంసీ, మరొకటి బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
- ఇక, మేనకా గురుస్వామి జీవితం న్యాయపరమైన ప్రతిభ, సామాజిక న్యాయం కోసం పోరాటం, అంతర్జాతీయ గుర్తింపులతో నిండి ఉంది. ఆమె రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం భారతదేశంలో సమానత్వానికి ఒక చారిత్రాత్మక మైలురాయి పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
- సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన మేనకా గురుస్వామి 2018లో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.
- ఆ బంధాలను నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేయడంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదుల్లో మేనక కూడా ఒకరు.
- ఈ కేసు వాదించిన గురుస్వామి కూడా ఎల్‌జీబీటీక్యూ. ఇప్పుడు రాజ్యసభకు ఎన్నికైతే.. పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించే తొలి ఎల్‌జీబీటీక్యూ ఎంపీగా రికార్డు సృష్టించనున్నారు.
- ఆమె 1997లో భారత మాజీ అటార్నీ జనరల్ అశోక్ దేశాయ్ ఆధ్వర్యంలో తన కెరీర్‌ను ప్రారంభించింది. అలాగే, ఆయనను ఆమె తన గురువుగా భావిస్తుంది.
- 2001లో ఆక్స్‌ఫర్డ్‌లో తన BCL మరియు హార్వర్డ్‌లో తన LLM పూర్తి చేసిన తర్వాత, ఆమె కొంతకాలం న్యూయార్క్‌లోని డేవిస్ పోల్క్, వార్డ్‌వెల్‌లో అసోసియేట్‌గా పనిచేసింది. తరువాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చి న్యూఢిల్లీలో స్థిరపడ్డారు.
- ఆమె 2019లో ఫారిన్ పాలసీ మ్యాగజైన్ 100 మంది అత్యంత ప్రభావవంతమైన గ్లోబల్ థింకర్స్ జాబితాలో చోటు సంపాదించారు. టైమ్ మ్యాగజైన్-2019లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
- ఇదిలా ఉండగా.. బెంగాల్‌లో ఇటీవల I-PAC కార్యాలయాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలను సవాలు చేస్తూ కోర్టు విచారణలో ఆమె.. టీఎంసీ తరఫున వాదనలు వినిపించారు. ఈ కారణంగానే ఆమెకు రాజ్యసభ స్థానం ఇచ్చినట్టు బెంగాల్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.
I. రాజ్యసభ సభ్యులు దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో (Proportional Representation) ఎన్నికవుతారు.
II. పశ్చిమ బెంగాల్‌లో ఖాళీ అవుతున్న 5 స్థానాలకు గానూ టీఎంసీ 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
పై వాటిలో సరైనవి ఏవి?
ఎ) I మాత్రమే
బి) II మాత్రమే
సి) I మరియు II
డి) ఏదీ కాదు
ఎ) కేశవానంద భారతి కేసు
బి) సెక్షన్ 377 రద్దు (నవతేజ్ సింగ్ జోహార్ కేసు)
సి) షా బానో కేసు
డి) పుట్టస్వామి కేసు (రైట్ టు ప్రైవసీ)
ఎ) అభ్యర్థి భారతీయ పౌరుడై ఉండాలి.
బి) కనీసం 30 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
సి) అభ్యర్థి ఏ రాష్ట్రం నుండి పోటీ చేస్తున్నారో, అదే రాష్ట్రంలో ఓటరుగా నమోదై ఉండాలి.
డి) లాభదాయక పదవిలో ఉండకూడదు.
ఎ) అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీ
బి) తొలి LGBTQ+ పార్లమెంట్ సభ్యురాలు
సి) అత్యధిక మెజారిటీ సాధించిన మహిళా ఎంపీ
డి) సుప్రీంకోర్టు నుండి నేరుగా ఎన్నికైన తొలి మహిళ
ఎ) నోబెల్ శాంతి బహుమతి
బి) టైమ్ మ్యాగజైన్ - 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా (2019)
సి) రామన్ మెగసెసే అవార్డు
డి) బుకర్ ప్రైజ్
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

